ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 1:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గుండు పిన్నుపై మట్టి గణపతి.. అబ్బురపరిచిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్.

గుండు పిన్నుపై మట్టి గణపతి.. అబ్బురపరిచిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్.

జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం సెప్టెంబర్ 14::

జగిత్యాల జిల్లా: జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండు పిన్నుపై మట్టి గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఈ సూక్ష్మ గణపతి తయారీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. గుండు పిన్ను, మట్టి, వాటర్ కలర్స్‌తో విగ్రహాన్ని తయారు చేసినట్లు దయాకర్ తెలిపారు.

ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నానని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని సూచించారు. మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా నీటి, భూమి కాలుష్యాన్ని నివారించవచ్చని, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.